సెప్టెంబర్ 11: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఊరటనిచ్చేలా దేశీయ మార్కెట్లో పసిడి ధరలు మరోసారి భారీగా తగ్గాయి. అదే సమయంలో వెండి ధరలు కూడా గణనీయంగా పడిపోయాయి. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో నమోదైన ధరల ప్రకారం హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి.
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,890గా ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే ఏకంగా రూ.2,620 తగ్గింది.
ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ.1,40,150గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే రూ.2,400 మేర తగ్గింది.
బంగారం ధరలు తగ్గడంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పతనమయ్యాయి. కిలో వెండి ధర ఏకంగా రూ.10 వేల మేర తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2.45 లక్షలుగా ఉంది.
బంగారం, వెండి ధరలు ఒకేసారి భారీగా తగ్గడంతో కొనుగోలుదారుల్లో ఆసక్తి పెరుగుతోంది. అయితే నగల కొనుగోలు సమయంలో పై రేట్లకు అదనంగా మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ, ఇతర వ్యయాలు వర్తించవచ్చని గమనించాలి.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు..
| నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
| హైదరాబాద్ | రూ.1,52,890 | రూ.1,40,150 | రూ.1,14,670 |
| నిజామాబాద్ | రూ.1,52,890 | రూ.1,40,150 | రూ.1,14,670 |
| ఖమ్మం | రూ.1,52,890 | రూ.1,40,150 | రూ.1,14,670 |
| వరంగల్ | రూ.1,52,890 | రూ.1,40,150 | రూ.1,14,670 |
ఏపీలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు
| నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
| విజయవాడ | రూ.1,52,890 | రూ.1,40,150 | రూ.1,14,670 |
| విశాఖపట్నం | రూ.1,52,890 | రూ.1,40,150 | రూ.1,14,670 |
| గుంటూరు | రూ.1,52,890 | రూ.1,40,150 | రూ.1,14,670 |
| నెల్లూరు | రూ.1,52,890 | రూ.1,40,150 | రూ.1,14,670 |
| తిరుపతి | రూ.1,52,890 | రూ.1,40,150 | రూ.1,14,670 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు
| నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
| చెన్నై | రూ.1,52,890 | రూ.1,40,150 | రూ.1,17,850 |
| ముంబై | రూ.1,52,890 | రూ.1,40,150 | రూ.1,14,670 |
| ఢిల్లీ | రూ.1,53,040 | రూ.1,40,300 | రూ.1,14,670 |
| కోల్‌కతా | రూ.1,52,890 | రూ.1,40,150 | రూ.1,14,820 |
| అహ్మదాబాద్ | రూ.1,52,940 | రూ.1,40,200 | రూ.1,14,720 |
| కేరళం | రూ.1,52,890 | రూ.1,40,150 | రూ.1,14,670 |

