ముంబైలోని అందేరీ ప్రాంతంలోని రన్వాల్ టవర్స్‌లో దీపావళికి ముందు అగ్నిప్రమాదం జరిగింది. టెలివిజన్ నటి దివ్యాంక త్రిపాఠి, ఆమె భర్త వివేక్ దహియా తమ కవల పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి భవనం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
సెక్యూరిటీ గార్డు మృతి
ప్రమాద సమయంలో పొగతో అస్వస్థతకు గురైన భవన సెక్యూరిటీ గార్డు ధన్పత్ను కూపర్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పొగ పీల్చడం వల్ల ఊపిరి ఆడక మరణించినట్లు అధికారులు వెల్లడించారని కథనంలో పేర్కొన్నారు.
ధన్పత్ను గుర్తు చేసుకున్న నటి
ధన్పత్ తమ కుటుంబ సభ్యుడిలా ఉండేవారని దివ్యాంక తన భావోద్వేగ పోస్టులో రాశారు. కవల పిల్లలను మొదట అభినందించిన వారిలో ఆయన కూడా ఉన్నారని, రోజువారీ జీవితంలో ఆప్యాయంగా మెలిగేవారని గుర్తుచేసుకున్నారు. ఆయన మరణవార్త తమను తీవ్రంగా బాధించిందని దంపతులు తెలిపారు.
భవనంలోని సీ వింగ్‌లో అగ్నిమాపక వ్యవస్థ పనిచేయడంతో మంటలను త్వరగా అదుపు చేయగలిగామని నివాసితులు పేర్కొన్నారు. ధన్పత్ ఆ భవనంలో దాదాపు తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్నారని కథనం తెలిపింది.

