కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు నవంబర్ 12 తెల్లవారుజామున శంషాబాద్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ‘కాకా’ సినిమాలోని ప్రత్యేక పాట చిత్రీకరణ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కారును వెనుక నుంచి ఢీకొన్న లారీ
ముచ్చింతల్ సమీపంలో పండ్ల లోడ్‌తో వెళ్తున్న లారీ.. శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు వెనుక భాగం దెబ్బతింది. శేఖర్ మాస్టర్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

