షేక్ హసీనా స్వచ్ఛందంగా బంగ్లాదేశ్‌కు తిరిగివెళ్లాలనుకోవడం, ఆమెను అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం చేసిన అధికారిక అభ్యర్థన వేర్వేరు అంశాలని భారత్ స్పష్టం చేసింది. అప్పగింత అభ్యర్థనను నిర్దేశిత విధానాల ప్రకారం పరిశీలిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.
న్యూఢిల్లీలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయంపై మాట్లాడారు. హసీనా స్వచ్ఛందంగా స్వదేశానికి వెళ్లాలనుకుంటే అందులో భారత ప్రభుత్వ ప్రమేయం ఉండదని చెప్పారు. ఆమె తిరుగు ప్రయాణంపై వచ్చిన వార్తల గురించి స్పందిస్తూ, అది హసీనా, బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు.
హసీనా భారత్‌లో ఉంటున్నారు
2024 ఆగస్టు 5న విద్యార్థుల ఉద్యమం తీవ్రరూపం దాల్చిన తర్వాత హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టారు. అప్పటి నుంచి ఆమె భారత్‌లో ఉంటున్నారు. డిసెంబర్ 16న బంగ్లాదేశ్ విజయ దినోత్సవం సందర్భంగా ఆమె స్వదేశానికి వెళ్లాలని భావిస్తున్నట్లు హసీనా ప్రతినిధి సయ్యద్ మొజమ్మెల్ అలీ వెల్లడించారు. ప్రయాణ పత్రాల కోసం ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌ను సంప్రదించినట్లు కూడా ఆయన తెలిపారు.

