నటి నభా నటేష్ తన తల్లికి క్షమాపణ చెబుతూ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. తల్లి సలహాలను చాలా ఏళ్లుగా పట్టించుకోకుండా, తనకే ఎక్కువ తెలుసని అనుకున్నానని ఆమె ఆ పోస్ట్‌లో అంగీకరించారు.
సలహాల కోసం గూగుల్, రీల్స్ వైపు
ఏం తినాలి, ఎప్పుడు నిద్రపోవాలి, అతిగా ఆలోచించడం ఎప్పుడు ఆపాలి, కడుపు ఇబ్బంది పెట్టినప్పుడు ఏం చేయాలి వంటి విషయాల్లో తల్లి దగ్గర సమాధానాలు ఉన్నాయని నభా రాశారు. అయితే ముందుగా అమ్మను అడగకుండా గూగుల్‌లో వెతికేదాన్నని, రీల్స్ చూసి స్నేహితులను సంప్రదించేదాన్నని తెలిపారు.
తల్లి చెప్పిందే సరైందని ఇప్పుడు ఒప్పుకుంటున్నానని, ఆమె మాట విననందుకు బహిరంగంగా క్షమాపణ చెబుతున్నానని నభా పేర్కొన్నారు. పోస్ట్‌కు ‘సారీ అమ్మా’ అంటూ ముగింపు ఇచ్చారు. ‘అమ్మకు అన్నీ తెలుసు’, ‘క్షమించు అమ్మా’ అనే అర్థం వచ్చే హ్యాష్ట్యాగ్లనూ జతచేశారు.

