ఆంధ్రప్రదేశ్లోని అన్ని జూనియర్ కళాశాలల్లో గురువారం రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ఇంటర్ బోర్డు ఆదేశించింది. ఉదయం 11 గంటలకు విద్యార్థులు, అధ్యాపకులతో భారత రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివించాలని సూచించింది.
కళాశాలలకు వర్తించే ఆదేశాలు
ప్రభుత్వ, ప్రైవేట్, సంక్షేమ కళాశాలలతో పాటు కేజీబీవీ, మోడల్ స్కూల్స్, కాంపోజిట్ డిగ్రీ కళాశాలల్లోనూ వేడుకలు జరపాలని బోర్డు స్పష్టం చేసింది. కార్యక్రమాల నిర్వహణలో అలసత్వం వహిస్తే తీవ్రంగా పరిగణిస్తామని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు, ప్రాంతీయ అధికారులకు హెచ్చరికలు జారీ చేసింది.
ఆన్లైన్ కార్యక్రమాల్లోనూ పాల్గొనాలని సూచన
MyGov పోర్టల్లో 23 భాషల్లో అందుబాటులో ఉన్న ఆన్లైన్ పీఠిక పఠనంలో విద్యార్థులు పాల్గొనాలని బోర్డు కోరింది. MYBharat, MyGov పోర్టల్స్ ద్వారా నిర్వహిస్తున్న రాజ్యాంగ క్విజ్లోనూ విస్తృతంగా పాల్గొనాలని సూచించింది. ‘వికసిత్ భారత్ యువ సంవాద్’ కార్యక్రమంలో యువత భాగస్వామ్యం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు.

