గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్లీ యూటర్న్ తీసుకున్నాయి. బుధవారం ఉదయం బంగారం ధరల్లో పెరుగుదల నమోదైంది. దీంతో పసిడి కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి తాజా ధరలు కీలకంగా మారాయి.
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, బుధవారం ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,440గా ఉంది. మంగళవారం ధరతో పోల్చుకుంటే రూ.270 పెరిగింది.
అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,40,650గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే రూ.250 మేర పెరిగింది.
ఇటీవలి రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో పసిడి కొనుగోలుదారులు కొంత ఊరట పొందారు. అయితే బుధవారం ఒక్కసారిగా ధరలు పెరగడంతో మార్కెట్‌లో మళ్లీ ధరల కదలికపై ఆసక్తి నెలకొంది.
బంగారం కొనుగోలు చేసే ముందు తాజా మార్కెట్ ధరలను పరిశీలించడం, ఆభరణాల విషయంలో మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ తదితర అదనపు ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవడం అవసరం.
ఏపీలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు
| నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
| విజయవాడ | రూ.1,53,440 | రూ.1,40,650 | రూ.1,15,080 |
| విశాఖపట్నం | రూ.1,53,440 | రూ.1,40,650 | రూ.1,15,080 |
| గుంటూరు | రూ.1,53,440 | రూ.1,40,650 | రూ.1,15,080 |
| నెల్లూరు | రూ.1,53,440 | రూ.1,40,650 | రూ.1,15,080 |
| తిరుపతి | రూ.1,53,440 | రూ.1,40,650 | రూ.1,15,080 |
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు..
| నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
| హైదరాబాద్ | రూ.1,53,440 | రూ.1,40,650 | రూ.1,15,080 |
| నిజామాబాద్ | రూ.1,53,440 | రూ.1,40,650 | రూ.1,15,080 |
| ఖమ్మం | రూ.1,53,440 | రూ.1,40,650 | రూ.1,15,080 |
| వరంగల్ | రూ.1,53,440 | రూ.1,40,650 | రూ.1,15,080 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు
| నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
| చెన్నై | రూ.1,53,440 | రూ.1,40,650 | రూ.1,18,380 |
| ముంబై | రూ.1,53,440 | రూ.1,40,650 | రూ.1,15,080 |
| ఢిల్లీ | రూ.1,53,590 | రూ.1,40,800 | రూ.1,15,230 |
| కోల్‌కతా | రూ.1,53,440 | రూ.1,40,650 | రూ.1,15,080 |
| అహ్మదాబాద్ | రూ.1,53,490 | రూ.1,40,700 | రూ.1,15,130 |
| కేరళం | రూ.1,53,440 | రూ.1,40,650 | రూ.1,15,080 |

