తిరుమలలో 62 మందిని గుర్తింపు
తిరుమలలో పోలీసులు, టీటీడీ విజిలెన్స్ విభాగం కలిసి నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 62 మందిని గుర్తించారు. కొండపై అనధికారికంగా ఉంటున్నవారిగా గుర్తించిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి, బస్సుల ద్వారా తిరుపతికి తరలించారు.
వసతి సముదాయాలు, హాళ్లలో అనుమతి లేకుండా ఉంటున్న యాచకులు, ఇతర వ్యక్తులపై ఇలాంటి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా, భిక్షాటనతో పాటు అనధికారిక నివాసాన్ని అరికట్టే ఉద్దేశంతో ఈ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
వ్యాపారులకు సూచనలు
తిరుమలలో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ఫుడ్ దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల్లో పని కోసం నియమించుకునే వ్యక్తుల వివరాలను ముందుగా పూర్తిగా తెలుసుకోవాలని పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు వ్యాపారులకు సూచించారు. ఉద్యోగులకు తగిన వసతి కల్పించాలని కూడా చెప్పారు.
తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా ఉంటూ భక్తులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు లేదా టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వాలని భక్తులను కోరారు.

