ఆంధ్రప్రదేశ్లో రెండో దశ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 55.07 శాతం పోలింగ్ నమోదైంది. 23 పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని 24,98,312 మంది ఓటర్లలో 13,75,799 మంది ఓటు వేశారు.
కందూరులో అత్యధిక పోలింగ్
ప్రకాశం జిల్లా కందుకూరులో 68.89 శాతం పోలింగ్ నమోదై అత్యధికంగా నిలిచింది. పొదిలిలో 68.46 శాతం, ఆమదాలవలసలో 68.14 శాతం ఓటింగ్ జరిగింది. మంగళగిరి-తాడేపల్లిలో 62.91 శాతం, బి. కొత్తకోటలో 62.47 శాతం నమోదైంది.
గూడూరులో అత్యల్పం
నెల్లూరు జిల్లా గూడూరులో 48.53 శాతం పోలింగ్ నమోదై ఈ జాబితాలో అత్యల్పంగా ఉంది. రాజమహేంద్రవరంలో 48.58 శాతం, శ్రీకాకుళంలో 49.05 శాతం పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 20 పట్టణ స్థానిక సంస్థల్లో ఓటింగ్ 50 శాతాన్ని దాటింది.

