పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడలో కారు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో జబర్దస్త్ ఆర్టిస్టులు దొరబాబు, రైజింగ్ రాజు గాయపడ్డారు. కారులో ఉన్న డ్రైవర్‌కు కూడా తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు
కాకినాడ నుంచి భీమవరం వెళ్తుండగా కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం దెబ్బతింది.
గాయపడినవారు భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

