ఏలూరు జిల్లా పోలవరం నిర్వాసిత కొరుటూరు గ్రామ గిరిజనులు సర్పంచ్ ఎన్నికలను బహిష్కరించారు. గ్రామానికి చెందిన 773 మంది ఓటు వేయడానికి రాలేదు.
పంచాయతీ విలీనంపై వ్యతిరేకత
కొరుటూరు పంచాయతీలో గాజులగొంది, వాడపల్లి, కొరుటూరు, చీడూరు, శిరివాక, టేకూరు గ్రామాలు ఉన్నాయి. ఈ పంచాయతీని గిరిజనేతర గ్రామమైన పి.అంకంపాలెంలో విలీనం చేయడాన్ని ఈ గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కొరుటూరు గ్రామాల ప్రజలు ఎంపీటీసీ ఎన్నికలనూ బహిష్కరించారు.
మరో పంచాయతీలోనూ ఎన్నికల బహిష్కరణ
ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయాలని కోరుతూ బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం పంచాయతీ పరిధిలోని తూటుకుంట, పల్లపూరు, పైడాకులమామిడి, తెల్లవరం, ములకలగూడెం గ్రామాల నిర్వాసితులు కూడా పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు.

