భారత పేసర్ మహ్మద్ షమీ టీమిండియాలోకి తిరిగి రావడంపై ఆలోచించడం మానేశానని చెప్పారు. ప్రస్తుతం తన ఆటపై దృష్టి పెట్టడంతో పాటు ఫిట్నెస్ను కాపాడుకుంటూ మంచి రిథమ్‌లో క్రికెట్ ఆడటం ముఖ్యమని తెలిపారు.
ప్రపంచకప్‌ల గురించి ఇప్పుడే ఆలోచన లేదు
2027 వన్డే ప్రపంచకప్, 2028 టీ20 ప్రపంచకప్‌లలో ఆడాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదని షమీ చెప్పారు. భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా ప్రస్తుత ఆటపై దృష్టి పెడతానని, సెలెక్టర్లు తీసుకునే ఏ నిర్ణయాన్నైనా గౌరవిస్తానని తెలిపారు.
దేశవాళీ క్రికెట్ కొనసాగిస్తా
ఫిట్నెస్, క్రికెట్‌పై ఆసక్తి ఉన్నంతకాలం రాష్ట్ర జట్టు తరఫున, ఐపీఎల్లో ఆడాలని కోరుకుంటున్నట్లు షమీ చెప్పారు. యువ ఆటగాళ్లు తన అనుభవం నుంచి నేర్చుకోవాలని ఆశిస్తున్నానన్నారు. టెస్టులకు వీడ్కోలు పలకడం దేశవాళీ క్రికెట్ ఆడటానికి అడ్డంకి కాదని, వైట్‌బాల్ క్రికెట్ కొనసాగిస్తానని తెలిపారు. అవసరమైతే ఫిట్నెస్ కోసం రెడ్‌బాల్ క్రికెట్ కూడా ఆడతానని, శరీరంపై మరీ ఎక్కువ భారం వేయకుండా కెరీర్‌ను కొనసాగించాలనుకుంటున్నానని చెప్పారు.

