బిగ్ బాస్ తెలుగు 10లో పన్నెండో వారం బడ్డీ అప్ థీమ్‌లో భాగంగా జరిగిన టాస్కుల్లో నరేష్, సుధీర్ విజయం సాధించారు. ఈ ఫలితంతో ఆర్కే, శివ్, దేబ్జానీ, అమన్, నరేష్, సుధీర్ కెప్టెన్సీ రేసులోకి వచ్చారు.
నరేష్ కోసం సన్నీ.. వర్షిణి కోసం సిరి
ఎపిసోడ్లో వీజే సన్నీ, సిరి మాజీ కంటెస్టెంట్లుగా ఇంట్లోకి వచ్చి టాస్కులో పాల్గొన్నారు. సన్నీ నరేష్‌కు జోడీగా, సిరి వర్షిణికి జోడీగా ఆడారు. గోడను బద్దలు కొట్టి ముందుకు సాగాల్సిన పోటీలో నరేష్ విజయం సాధించాడు. వర్షిణి టాస్కులో వెనుకబడటంతో నిరాశకు గురై ఏడ్చింది. తనకు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయానని ఆమె చెప్పగా, బిగ్ బాస్ ఆమెను ప్రోత్సహించినట్లు ఎపిసోడ్లో చూపించారు.
సుధీర్‌కు నిఖిల్ జోడీ
తర్వాత నిఖిల్, పృథ్వీ మరో టాస్కులో పాల్గొన్నారు. పోటీదారులు జంటలుగా ఏర్పడగా, నిఖిల్ సుధీర్ కోసం, పృథ్వీ వంశీ కోసం ఆడేందుకు సిద్ధమయ్యారు. రెండు దశలుగా సాగిన ‘అన్‌లాక్, బిల్డ్ పిరమిడ్’ టాస్కులో సుధీర్ సిలిండర్లను వేగంగా అన్‌లాక్ చేసి ముందంజ వేశాడు. వంశీ ఆ దశలో వెనుకబడటంతో సుధీర్ గెలిచాడు. నిఖిల్ కూడా పిరమిడ్‌ను త్వరగా పూర్తి చేశాడు.
ఈ విజయాల తర్వాత కెప్టెన్సీ పోటీకి ఆర్కే, శివ్, దేబ్జానీ, అమన్, నరేష్, సుధీర్ అర్హత సాధించారు. వారిలో చివరి కెప్టెన్ ఎవరు అవుతారనే విషయం తదుపరి పోటీలో తేలనుంది.

