ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సమక్షంలో ఆజం ఖాన్ తన జైలు అనుభవాలను వివరించారు. అఖిలేశ్ కూడా ఆరు నెలలు జైలులో ఉంటే అక్కడి పరిస్థితులు, బాధలు స్వయంగా తెలిసేవని తన కుమారుడితో అనుకునేవాడినని చెప్పారు.
తండ్రి, కుమారుడిని వేర్వేరు వాహనాల్లో తీసుకెళ్లే ఏర్పాట్లు
జైలు నుంచి మరో ప్రాంతానికి తరలించే సమయంలో తనను, కుమారుడు అబ్దుల్లాను వేర్వేరు వాహనాల్లో తీసుకెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారని ఆజం ఖాన్ తెలిపారు. ఎందుకు విడివిడిగా తీసుకెళ్తున్నారని అడిగినా సమాధానం రాలేదని చెప్పారు. ఆ సమయంలో కుమారుడితో ఇదే చివరి కలయిక కావచ్చని, మళ్లీ కలవకపోతే మరో లోకంలో కలుసుకుందామని అన్నట్లు వివరించారు. అది తనకు మర్చిపోలేని బాధాకరమైన అనుభవమని పేర్కొన్నారు.
జైలు జీవితం ప్రభావం
ఐదున్నరేళ్ల జైలు జీవితం తన శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని ఆజం ఖాన్ అన్నారు. తన భార్య, కుమారుడు కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని చెప్పారు. ప్రభుత్వం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి దర్యాప్తు సంస్థలు తనను, తన కుటుంబాన్ని వేధించాయని ఆయన ఆరోపించారు.

