ప్రముఖ తెలుగు నటుడు గిరిబాబు కన్నుమూశారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో హీరోగా, విలన్గా, హాస్యనటుడిగా, సహాయక నటుడిగా విభిన్న పాత్రలు పోషించారు. 600కు పైగా సినిమాల్లో నటించినట్లు గిరిబాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
‘జగమే మాయ’లో విలన్గా ఎంట్రీ
ప్రకాశం జిల్లా రావినూతలకు చెందిన గిరిబాబు 1973లో ‘జగమే మాయ’తో వెండితెరకు పరిచయమయ్యారు. తొలి సినిమాలో విలన్గా నటించినా, ఆ పాత్ర చుట్టూనే కథ తిరుగుతుందని ఆయన గుర్తుచేసుకున్నారు. ఒకే సమయంలో ఒక థియేటర్లో తన సినిమా చూసి హీరోగా మెచ్చుకునేవారని, మరో థియేటర్లో విలన్గా చూసి తిట్టేవారని తన కెరీర్లోని ఓ ఆసక్తికర అనుభవాన్ని పంచుకున్నారు.
కురుక్షేత్రం నుంచి రేసుగుర్రం వరకు
‘కురుక్షేత్రం’, ‘ఇడియట్’, ‘అతడు’, ‘కితకితలు’, ‘రేసుగుర్రం’ వంటి చిత్రాలతో గిరిబాబు వేర్వేరు తరాల ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ‘దేవతలారా దీవించండి’తో నిర్మాతగా విజయాన్ని అందుకున్న ఆయన, ‘ఇంద్రజిత్’, ‘నీ సుఖమే నే కోరుతున్నా’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

