పాకిస్తాన్ వాతావరణ శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్‌కు ఆగ్రాలోని తాజ్ మహల్‌ను సందర్శించేందుకు భారత కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఢిల్లీలోని నిజాముద్దీన్ దర్గాను సందర్శించాలన్న ఆయన అభ్యర్థనకు మాత్రం అనుమతి లభించలేదు.
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) నాగరికతల సంభాషణల వేదిక సదస్సులో పాల్గొనేందుకు మాలిక్ భారత్‌కు వచ్చారు. తాజ్ మహల్‌తో పాటు నిజాముద్దీన్ దర్గాను సందర్శించేందుకు ఆయన తొలుత అనుమతి కోరినట్లు సమాచారం. తాజ్ సందర్శనకు ఇప్పుడు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, హుమాయున్ సమాధి, ఢిల్లీ హాత్ సహా రాజధానిలోని పలు చారిత్రక ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా క్లియరెన్స్ ఇచ్చింది. మాలిక్ నేతృత్వంలోని బృందం ఈ ప్రాంతాలను సందర్శించనుంది.
సదస్సులో శాంతి, సంబంధాలపై వ్యాఖ్యలు
సదస్సు ప్రారంభమైన తర్వాత మీడియాతో మాట్లాడిన మాలిక్, శాంతి, భద్రతను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలకు పాకిస్తాన్ మద్దతు ఇస్తుందని చెప్పారు. భారత్‌తో ఇక ఫిర్యాదులు ఉండవని, రెండు దేశాల మధ్య పర్యటనలు కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్సీఓ సభ్య దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలని కూడా ఆయన అన్నారు.
గత మూడేళ్లలో భారత్‌ను సందర్శించిన తొలి పాకిస్తానీ మంత్రి మాలిక్ అని సమాచారం.

