కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ పానీయాల ప్లాంట్ ప్రారంభమై ఉత్పత్తి మొదలైంది. శంకుస్థాపన జరిగిన 12 నెలల్లోపే ప్లాంట్ అందుబాటులోకి వచ్చిందని మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌లో తెలిపారు. గత ఏడాది నవంబర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
పానీయాల సరఫరా, ఉద్యోగాలు
ఈ ప్లాంట్ నుంచి క్యాంపా కోలా, జ్యూస్‌లు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ను దేశీయంగా, విదేశాలకు సరఫరా చేయనున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు. స్థానిక యువతకు వారి జిల్లాలోనే 1,200 ప్రత్యక్ష ఉద్యోగాలు లభించాయని, లాజిస్టిక్స్ మరియు వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ వేలాది మందికి ఉపాధి కలుగుతుందని ఆయన తెలిపారు.
ప్లాంట్ ప్రారంభాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు ఉదాహరణగా మంత్రి అభివర్ణించారు. ఈ పెట్టుబడితో రాయలసీమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని కూడా ఆయన అన్నారు.

