సర్పంచ్ ఎన్నికల్లో అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులను ఆదేశించారు. మంత్రాలయం మండలంలోని సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించిన రచ్చమర్రి, మాధవరంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
152 కేంద్రాలకు 100 మంది పోలీసులు
మంత్రాలయం మండలంలో 152 పోలింగ్ కేంద్రాల వద్ద 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఎన్నికలు సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలని, ఇది అందరి బాధ్యత అని ఆయన సూచించారు. బందోబస్తు తనిఖీ ఎమ్మిగనూరు డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగింది. సీఐలు గిరిబాబు, శ్రీనివాస నాయక్, ఎస్ఐలు విజయ్‌కుమార్, మల్లికార్జున పాల్గొన్నారు.

