నిర్మల్ జిల్లా బాసరలోని రవీంద్రపూర్ కాలనీలో ఓ ఇంట్లో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో ఇంట్లోని కుటుంబసభ్యులు బయటకు పరుగులు తీశారు.
ఆస్తి నష్టం
షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు మొదలైనట్లు ప్రాథమిక సమాచారం. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.10 లక్షల నగదు, నాలుగు తులాల బంగారం, వెండి, విలువైన పత్రాలు, ఇతర వస్తువులు దగ్ధమైనట్లు బాధితులు తెలిపారు.
కుమార్తె పెళ్లి కోసం తెచ్చిన ఫర్నిచర్, బట్టలు కూడా కాలిపోయాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

