నంద్యాల జిల్లా బనగానపల్లె మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా బీసీ ఇందిరా రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి.
పంచాయతీలోని మొత్తం 20 వార్డు సభ్యుల స్థానాలకూ ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. నవంబర్ 19న సర్పంచ్ అభ్యర్థిగా ఇందిరా రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆ కార్యక్రమానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు.
గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్న ఇందిరా రెడ్డి
సర్పంచ్‌గా ఎన్నికైతే బనగానపల్లెను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఇందిరా రెడ్డి ప్రకటించారు.

