అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బాటజంగాలపాలెం హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. రహదారిపై ఆగి ఉన్న ట్రైలర్‌ను టిప్పర్ వెనుక నుంచి ఢీకొనడంతో క్యాబిన్లో మంటలు చెలరేగాయి.
తెల్లవారుజామున ప్రమాదం
పోలీసుల వివరాల ప్రకారం, నవంబరు 24న తెల్లవారుజామున సుమారు 4 గంటలకు ఈ ఘటన జరిగింది. ఢీకొన్న తర్వాత టిప్పర్ క్యాబిన్‌కు మంటలు వ్యాపించడంతో అందులో చిక్కుకున్న డ్రైవర్ సూరి అప్పారావు (45), క్లీనర్ శ్యామ్ ప్రసాద్ (22) ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదాన్ని గమనించిన వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

