అమరావతి, జూన్ 7: రాజ్యసభ ఎన్నికల కోసం జనసేన పార్టీ అభ్యర్థిగా శ్రీ లింగమనేని రమేష్ శనివారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. రాష్ట్ర శాసనసభ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి శ్రీమతి వనితా రాణికి ఆయన నామినేషన్ సమర్పించారు.
నామినేషన్ దాఖలు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు ఎమ్మెల్సీ శ్రీ నాగబాబు, ఎమ్మెల్యేలు శ్రీ నక్కా ఆనందబాబు, శ్రీ ఎన్. ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ లింగమనేని రమేష్ అభ్యర్థిత్వాన్ని శ్రీ పులపర్తి రామాంజనేయులు, శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, శ్రీ బొమ్మిడి నాయకర్, శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్, శ్రీ దేవ వరప్రసాద్, శ్రీ కొల్లు రవీంద్ర, శ్రీ నాదెండ్ల మనోహర్, శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్, శ్రీ నక్కా ఆనందబాబు, శ్రీ ఎన్. ఈశ్వరరావు ప్రతిపాదించారు.
ఈ సందర్భంగా ఉపసభాపతి శ్రీ రఘురామ కృష్ణంరాజు, ఎంపీలు శ్రీ వి. బాలశౌరి, శ్రీ టి. ఉదయ్ శ్రీనివాస్, శాసన మండలి విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్యేలు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు, శ్రీ గిడ్డి సత్యనారాయణ తదితరులు శ్రీ లింగమనేని రమేష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా బి-ఫామ్ అందజేత
అంతకుముందు శనివారం ఉదయం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా శ్రీ లింగమనేని రమేష్ బి-ఫామ్ అందుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న శ్రీ రమేష్‌కు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేసి విజయవంతమైన ప్రజా సేవ అందించాలని ఆకాంక్షించారు.
జనసేన పార్టీ తరఫున రాజ్యసభకు పోటీ చేస్తున్న లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు కార్యక్రమం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.

