ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. మాజీ ముఖ్యమంత్రి Y. S. Jagan పై మంత్రి Nara Lokesh చేసిన తీవ్ర వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. “ఇవేం రాక్షస చేష్టలు జగన్?” అంటూ లోకేశ్ చేసిన విమర్శలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
X లో స్పందించిన లోకేశ్, దేశ రక్షణకు అవసరమైన అధునాతన బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి వస్తే స్వాగతించాల్సింది పోయి… తరిమేస్తానని జగన్ చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
మత్స్యకారుల పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటే ఆనందించాల్సింది పోయి, అడ్డుకుంటాననడం “సైకోయిజం” కాదా? అంటూ లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల్లో వ్యక్తిగత విమర్శలూ వెల్లువెత్తడం గమనార్హం.
“తల్లిని తరిమేసి, చెల్లిని గెంటేసిన వ్యక్తికి దైవ భక్తి లేదు… దేశం అంటే ద్వేషం మాత్రమే” అంటూ లోకేశ్ నేరుగా జగన్‌పై దాడి చేశారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని, పెట్టుబడులు వస్తే వాటిని కూడా దోపిడీగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.
ఇంకా ముందుకెళ్లి, “అమరావతిని మార్చేస్తాం, కట్టినవన్నీ కూల్చేస్తాం, కంపెనీలన్నీ వెళ్లగొడతాం అంటున్నారు… ఇది నాయకత్వమా లేక విధ్వంస రాజకీయాలా?” అంటూ తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు.

