యలహంక ప్యాలెస్ వివాదం వైఎస్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత అంశమని పరివర్తన రాజనీతి పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యవహారంపై తాను మాట్లాడటం సమంజసం కాదని పేర్కొన్నారు.
కుటుంబ ఆస్తుల వ్యవహారమని వ్యాఖ్య
గతంలో ఆ కుటుంబానికి ఆడిటర్‌గా పనిచేశానని విజయసాయిరెడ్డి తెలిపారు. ప్యాలెస్‌కు సంబంధించిన పూర్తి విషయాలు తనకు తెలిసినా వెల్లడించబోనని అన్నారు. వైఎస్ కుటుంబంలో ఏమి జరిగిందనే అంశం తనకు, కేవీపీకి మాత్రమే తెలుసని పేర్కొన్నారు.
ప్యాలెస్‌పై బయట జరుగుతున్న చర్చలు అవాస్తవమని ఆయన అన్నారు. ఆస్తుల వ్యవహారం వ్యక్తిగతమైనదని, అయితే ఆస్తులపై కోర్టు నోటీసులు వస్తే వివరాలు చెప్పాల్సి ఉంటుందని తెలిపారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిప్రాయం ఏమిటో జగన్, కుటుంబ సభ్యులు, తాను, కేవీపీలకు మాత్రమే తెలుసని కూడా విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

