ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో ఇండియా-ఏ, పాకిస్తాన్-ఏ మ్యాచ్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ, పాకిస్తాన్ ఆటగాళ్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వైభవ్ ఔటై పెవిలియన్‌కు వెళ్తుండగా పాకిస్తాన్ ఆటగాళ్లు కవ్వించడంతో మాటల యుద్ధం మొదలైనట్లు మ్యాచ్ దృశ్యాల్లో కనిపించింది.
13 బంతుల్లో 11 పరుగులు
పాకిస్తాన్ బౌలర్ మొహమ్మద్ ఇమ్రాన్ బౌలింగ్‌లో వైభవ్ 13 బంతుల్లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు. పాకిస్తాన్ కెప్టెన్ అబ్దుల్ సమద్‌కు క్యాచ్ ఇచ్చి అతడు వెనుదిరిగాడు. పరిస్థితి మరింత పెద్దదవకుండా అభిషేక్ శర్మ వైభవ్‌ను సముదాయించి అక్కడి నుంచి పంపించిన దృశ్యాలు కెమెరాల్లో కనిపించాయి.
పాకిస్తాన్ 313 పరుగులకు ఆలౌట్
మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.2 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది. హసన్ నవాజ్ 79, మాజ్ సదాఖత్ 59, ఫర్హాన్ యూసఫ్ 56 పరుగులు చేశారు. ఓపెనర్ షమిల్ హుస్సేన్ 33 పరుగులు సాధించాడు.
భారత-ఏ బౌలర్లలో హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, సూర్యాన్ష్ షెడ్గే, విప్రజ్ నిగమ్ రెండేసి వికెట్లు తీశారు. ఆయుష్ బదోని ఒక వికెట్ పడగొట్టాడు.

