ప్రకాశం జిల్లా టంగుటూరు సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన కారు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సైడ్వాల్ను ఢీకొని బోల్తా పడిన కారు
తిరుమల దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా కారు సైడ్వాల్ను ఢీకొని బోల్తా పడినట్లు అందుబాటులో ఉన్న వివరాలు చెబుతున్నాయి. శుభకార్యానికి వెళ్లి వస్తున్న కుటుంబంలో ఈ విషాదం చోటుచేసుకోవడం బాధాకరమని జగన్ పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన కొత్తగా పెళ్లయిన జంటను రిమ్స్‌కు తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జగన్ కోరారు. మృతులు ఒంగోలు, బాపట్ల ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించినట్లు వివరాలు పేర్కొన్నాయి.

