భారత్‌లో పెద్దఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నారన్న ప్రచారాన్ని గూగుల్ క్లౌడ్ ఇండియా ఖండించింది. అయితే, పనుల నిర్వహణ, ప్రాధాన్యతల్లో మార్పులకు అనుగుణంగా చేపట్టిన సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో సుమారు 30 పోస్టులు రద్దు చేసినట్లు తెలిపింది.
ప్రభావితుల వివరాలు వెల్లడించలేదు
ఈ మార్పులతో ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు, ఏ విభాగాల్లో పోస్టులు రద్దయ్యాయి అనే వివరాలను సంస్థ వెల్లడించలేదు. రద్దయిన పోస్టుల సంఖ్య ఉద్యోగుల సంఖ్యతో సమానమని కూడా సమాచారం లేదు.
సోషల్ మీడియాలో ప్రచారంపై స్పందన
ఉద్యోగులు 24 గంటల్లో రాజీనామా చేయాలని, లేదంటే తొలగిస్తామని యాజమాన్యం హెచ్చరించిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. వచ్చే జనవరిలో మరో విడత ఉద్యోగ కోతలు ఉండొచ్చన్న ఊహాగానాలూ వెలువడ్డాయి. గూగుల్ క్లౌడ్ ఇండియా అధికారిక ఖాతా స్పందిస్తూ, భారత్‌లో భారీ స్థాయిలో లేఆఫ్‌లు జరుగుతున్నాయన్న ప్రచారం నిజం కాదని తెలిపింది. పని ప్రణాళికల్లో మార్పులకు అనుగుణంగా పరిమిత స్థాయిలో పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు పేర్కొంది.

