అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా షాక్కు గురైన ప్రైవేట్ విద్యుత్ కార్మికుడిని సహచరుడు స్తంభంపైనే సీపీఆర్ చేసి రక్షించే ప్రయత్నం చేశాడు. అనంతరం కార్మికుడిని కిందకు దించి ఆస్పత్రికి తరలించారు.
మరమ్మతుల సమయంలో ప్రమాదం
రాజు అనే కార్మికుడు విధుల్లో భాగంగా విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా కరెంట్ షాక్కు గురయ్యాడు. అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లి, తీగల మధ్య స్తంభంపైనే చిక్కుకున్నాడు.
స్తంభంపైనే సీపీఆర్
కింద ఉన్న సిబ్బందిలో ఒకరు ముందుగా విద్యుత్ సరఫరాను నిలిపివేసి స్తంభంపైకి ఎక్కి రాజుకు సీపీఆర్ చేశారు. అనంతరం అతడిని సురక్షితంగా కిందకు దించి మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో రాజు ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు అందుబాటులో లేవు.

