అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు కీలక కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనుంది. ఉదయం 10:30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.
ఇటీవల అమరావతి చట్టానికి ఆమోదం లభించిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం మరియు ప్రధానికి కేబినెట్ ధన్యవాదాలు తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ అంశంపై అధికారిక తీర్మానం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
అదేవిధంగా, 16వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో చర్చించిన పలు పెట్టుబడి ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశముంది. మొత్తం రూ.39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఈ ప్రాజెక్టులు పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు మరియు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.
రేపటి కేబినెట్ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధి దిశలో కీలకంగా మారే అవకాశముంది.

