సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్, డబుల్స్ ఫైనల్స్‌లో భారత క్రీడాకారిణులు ఓటమి పాలయ్యారు. ఆదివారం లఖ్‌నవూలో జరిగిన ఈ మ్యాచ్‌లతో భారత్‌కు ఈ రెండు విభాగాల్లోనూ టైటిల్ దక్కలేదు.
మహిళల డబుల్స్‌లో గత రెండు ఎడిషన్ల విజేతలైన ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్ ఇండోనేషియాకు చెందిన ఇసియానా, క్వినారా జంట చేతిలో 24-22, 12-21, 19-21తో ఓడారు. 79 నిమిషాలపాటు సాగిన పోరులో భారత జోడీ తొలి గేమ్ గెలిచినా, తర్వాతి రెండు గేమ్‌లను ప్రత్యర్థులు సొంతం చేసుకున్నారు.
మహిళల సింగిల్స్ ఫైనల్లో 17 ఏళ్ల తన్వి శర్మ థాయ్‌లాండ్ క్రీడాకారిణి సుపనిద కటేథాంగ్ చేతిలో 21-11, 12-21, 15-21తో పరాజయం పాలైంది. తన్వి తొలి గేమ్ గెలిచినప్పటికీ, సుపనిద తర్వాతి రెండు గేమ్‌లలో విజయం సాధించింది.

