మాజీ కార్పొరేటర్, జనసేన నేత పీతల మూర్తి యాదవ్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు రాజీనామా లేఖ పంపినట్లు ఆయన తెలిపారు.
టికెట్ కేటాయింపుపై అసంతృప్తి
విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇటీవలి ఎన్నికల్లో జనసేన తరఫున కార్పొరేటర్ టికెట్ ఇవ్వకపోవడం తనకు అన్యాయమని యాదవ్ ఆరోపించారు. 2021లో జనసేన బీఫామ్‌పై గెలిచిన వారందరికీ మళ్లీ టికెట్లు ఇచ్చారని, తనను మాత్రం పక్కన పెట్టారని ఆయన పేర్కొన్నారు.
టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 62 ఓట్ల తేడాతో ఓడిపోయానని యాదవ్ చెప్పారు. ఈ పరిణామం వెనుక కొందరి కుట్ర ఉందని తాను భావించినట్లు తెలిపారు. జనసేనలో ఉన్నప్పుడు పార్టీ కోసం 6 వేల సభ్యత్వాలు చేయించానని కూడా ఆయన గుర్తుచేశారు.
తనకు గతంలో జీవీఎంసీలో పదవి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసిన యాదవ్, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, టీడీఆర్ అంశం, వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్‌పై తాను పోరాడినట్లు సమావేశంలో వివరించారు. గత ఎన్నికల్లో కార్పొరేటర్ టికెట్ ఇప్పించినందుకు పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

