హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి లంకల కేందర్ల ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ నెల 28న జరగనున్న ఎన్నికల్లో సిడెన్హామ్ నియోజకవర్గం నుంచి ది రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఆమె బరిలో ఉన్నారు.
12 మంది అభ్యర్థులున్న బరిలో
సిడెన్హామ్ నియోజకవర్గంలో మొత్తం 12 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బ్యాలెట్ పేపర్‌పై లక్ష్మికి మూడో స్థానం కేటాయించారు. ఆమె అభ్యర్థిత్వాన్ని విక్టోరియా ఎన్నికల సంఘం నమోదు చేసినట్లు సమాచారం.
భద్రత, రవాణా, విద్య, వైద్యంపై ప్రచారం
ప్రజా భద్రత, రవాణా సదుపాయాలు, విద్య, వైద్యం లక్ష్మి ప్రచారంలో ప్రధాన అంశాలు. పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడం, నేరాల నివారణకు చర్యలు తీసుకోవడం తన భద్రతా ప్రణాళికలో భాగమని ఆమె హామీ ఇచ్చారు. మెరుగైన రహదారులు, సురక్షిత కూడళ్లు, నమ్మకమైన ప్రజా రవాణా, మెరుగైన అనుసంధానం కల్పించడానికీ ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు.
పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, అవసరమైన వనరులు మెరుగుపరచడం, ఆసుపత్రులు, జనరల్ ప్రాక్టీషనర్లు, అత్యవసర వైద్య సేవలు ప్రజలకు సులభంగా అందేలా చూడడం కూడా ఆమె ప్రచార హామీల్లో ఉన్నాయి.
హైదరాబాద్‌లో చదువు
లక్ష్మి హైదరాబాద్‌లోని కేశవ మెమోరియల్ స్కూల్ అండ్ కాలేజీలో చదివి, ఢిల్లీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ప్రస్తుతం భర్తతో కలిసి ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. ఆమె తల్లి, కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఉంటున్నారు.

